దత్తిరాజేరు మండలం పెదమానాపురంలోని 3 వ రైల్వే లైన్ బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ మంగళవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేపట్టారు. మూడో రైల్వే లైన్ నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన వారికి అధికారులు గతంలో ఇచ్చిన హామీ మేరకు నష్ట పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా నాయకులు జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.