గజపతినగరానికి చెందిన డాక్టర్ బొంతల కోటి శంకర్రావుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. మూడు సంవత్సరాలుగా గజపతినగరం మండలం గంగచోళ్ళపెంట, తమ్మిరాజుపేట స్కూళ్లలో బొంతలకోటి కళారూపాలతో విద్యాబోధన విధానాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు పరిశీలించారు. ఆయన కృషిని గుర్తించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేసి బంగారు పతకాన్ని అందజేసినట్లు ఆదివారం తెలిపారు.