ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని హౌసింగ్ డీఈ రంగారావు కోరారు. ఈ పథకం ద్వారా గంట్యాడ మండలంలో 2900 ఇళ్ళు మంజూరయ్యాయని తెలిపారు. అందులో 1700 ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మిగిలి ఉన్న 1200 ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆయన కోరారు. ఇంటి నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.