రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమవుతాయని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. సోమవారం ఆమె జామిలోని ఆర్ఎస్కేలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు అమ్ముకున్న ధాన్యానికి సంబంధించి డబ్బులు కొరకు నానా అవస్థలు పడాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.