కలిసికట్టుగా పని చేద్దాం విజయాన్ని సాధిద్దాం

78చూసినవారు
కలిసికట్టుగా పని చేద్దాం విజయాన్ని సాధిద్దాం
సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని సాధిద్దామని గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతినగరంలోని ఆల్తి వారి కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి జనసేన పార్టీ పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర భవిష్యత్ కోసం అందరం నడుం బిగించాలన్నారు. జనసేన నేతలు పైల మహేష్ కలిగి పండు ఆధ్వర్యంలో జరిగింది. జనసేన, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్