గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో బుధవారం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గేదల ఈశ్వరరావు ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యతగా ఉండాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు తమ చుట్టూ ఉన్న ప్రదేశాలను కూడా శుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు.