మెంటాడ మండలం జయితి గ్రామంలో మంగళవారం వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.దీంతో గ్రామంలోని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు వీధి కుక్కలు కాటేస్తాయని భయం భయంతో తిరుగుతున్నారు. వీధి కుక్కలు గ్రామంలోని కోళ్లను ఎప్పటి కప్పుడు తినేస్తున్నాయని తెలిపారు. మంగళవారం సాయంత్రం కుక్కల దాడిలో ఒక మేక పిల్ల చనిపోయిందని కిక్కర సింహాచలం అనే మహిళ తెలిపారు.