ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం

72చూసినవారు
ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం
ఎన్నికల లెక్కింపు జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని మన్యం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ మంగళవారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ను ఇవిఎం లెక్కింపుకు అరగంట ముందు అనగా ఉదయం 7. 30 గంటలకు ప్రారంభం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. లెక్కింపుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వివరించారు.

సంబంధిత పోస్ట్