పార్వతీపురం మన్యం జిల్లాలో మత్స్యసంపద వృద్ధిలో భాగంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కురుపాం నియోజకవర్గం తోటపల్లి రిజర్వాయర్ లో దాదాపు నాలుగు లక్షల ఫింగర్లింగ్స్ ( చేప పిల్లలు )ను తోటపల్లి రిజర్వాయర్ చైర్ పర్సన్ పొదిలాపు విజయరమణి వదిలారు. మొత్తం పది లక్షల చేప పిల్లలను గుమ్మలక్ష్మిపురం మండలం డుమ్మంగి ప్రభుత్వ చేపల పెంపక కేంద్రం నుండి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు.