పార్వతీపురం ఐటీడీఏ వెలుగు ఏపిడిగా పనిచేసిన సత్యనారాయణపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు కొమరాడ మండలం కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఏపిడిగా పనిచేసిన సమయంలో కొమరాడ మండలంలో మహిళా సంఘాల సభ్యులకు రావలసిన కమీషన్లను ఆయన దోచుకున్నారని సమగ్ర దర్యాప్తు చేపట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.