వైస్సాసిఆర్ సీపీ విద్యార్థి విభాగం మన్యం జిల్లా అధ్యక్షుడిగా గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ గౌరీ శంకర్ ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ సందర్బంగా మంగళవారం శంకర్ మాట్లాడుతూ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజ్ సిఫార్సులు మేరకు తనను విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిందన్నారు. జిల్లాలో వైసీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.