గరుగుబిల్లి మండలంలోని సుంకి, సంతోషపురం పంచాయతీల్లో సంచరించిన గజరాజుల గుంపు గురువారం జియ్యమ్మవలస మండలం పెదకుదమ వైపు పయనమయ్యాయి. గత పది రోజులకు పైగా సుంకి పరిధిలో అధికంగా వరి, అరటి, పామాయిల్ పంటలతో పాటు టీ దుకాణాలు, వ్యవసాయ మోటార్లు, పైపులను ధ్వంసం చేశాయి. గజరాజుల గుంపు సంచారంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.