భోగాపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

57చూసినవారు
భోగాపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు బైక్పై వస్తున్న యువకుడు రక్షణ గోడను బలంగా ఢీకొన్నాడు. ప్రమాదంలో యువకుడి తలకు బలమైన గాయం కావడంతో స్థానిక పోలీస్ సిబ్బంది విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించగా.. యువకుడు అప్పటికే మృతి చెందాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్