నెల్లిమర్లలో ఉన్న సికేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మంగళవారం సందర్శించారు. ప్రిన్సిపాల్ ను అపార్ ఐ. డి ఎంతవరకు జారీ చేసారని కలెక్టర్ ప్రశ్నించారు. 50 శాతం పూర్తయ్యాయని, ఆధార్ సమస్య వలన ఆలస్యం అవుతోందని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాలలో650 మంది విద్యార్థులు ఉన్నారని, తరగతి గదులు సరిపోవడం లేదని, అధ్యాపకులు కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ స్పందిస్తూ అందుకోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు.