నెల్లిమర్ల: డెంకాడ మండలంలో సంకల్పం కార్యక్రమం

65చూసినవారు
నెల్లిమర్ల: డెంకాడ మండలంలో సంకల్పం కార్యక్రమం
డెంకాడ మండలం బొడ్డవలస గ్రామంలో మంగళవారం రాత్రి సంకల్పం కార్యక్రమాన్ని ఎస్ఐ సన్యాసినాయుడు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా బాణసంచా తయారీ, నిల్వలు ఉంచకూడదని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్