పూసపాటిరేగ మండలం కొణతాలపాలెంలోని చెరువులు కాలుష్యానికి గురువుతున్నయని ప్రజల ఫిర్యాదు మేరకు మంగళవారం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చెరువులను పరిశీలించారు. పైడి భీమవరంలో ఫార్మా కంపెనీల కారణంగా చెరువులు కాలుష్యానికి గురవుతున్నాయని ప్రజలు ఆరోపించారు. ప్రజారోగ్యం పరిరక్షించేందుకు, చెరువులు కాలుష్య నివారణకు సత్వర చర్యలు చేపడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.