జయకృష్ణకు మంత్రివర్గంలో చోటు?

72చూసినవారు
జయకృష్ణకు మంత్రివర్గంలో చోటు?
పాలకొండ ఎమ్మెల్యేగా జయకృష్ణ విజయం సాధించినందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి శనివారం పిలుపు వచ్చింది. ఈ మేరకు ఆయన విజయవాడకు బయలుదేరి వెళ్లారు. దీంతో ఆయనకు మంత్రి పదవి వస్తుందని చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం జనసేనకు 2మంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే జయకృష్ణ ఒక్కరే ఉండడంతో మంత్రివర్గంలో చోటుదక్కుతోందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్