ఏబీ రోడ్డుపై శుక్రవారం బిల్లుమడ గ్రామం వద్ద బురదలో రెండు లారీలు కూరుకుపోవటంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడవి అక్కడ నిలిచిపోయాయి. ఈ రహదారిలో ప్రయాణించాలి అంటేనే ప్రయాణికులు, వాహనదారులు భయపడుతున్నారు. ఈ రహదారిలో ప్రయాణిస్తే గమ్య స్థానానికి ఎప్పుడు చేరుకుంటామో తెలియక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.