సాలూరు మున్సిపల్ పరిధిలోని ప్రధాన నీటి సరఫరా కేంద్రం వద్ద మంచినీటి సరఫరా చేస్తున్న 4వ నెంబర్ పిస్ట్రేషన్ బావిలో మోటర్ మరమ్మత్తుకు గురైంది. దీంతో బుధవారం మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఇన్ చార్జ్ కమిషనర్ తెలిపారు. మోటర్ వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పట్టణంలో వారం రోజుల వరకు కూడా మంచినీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తామని తెలిపారు.