మన్యం జిల్లాలో వరి కోతలు పూర్తయిన నేపథ్యంలో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వీలైనంత త్వరగా రైతుల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ మండల అధికారులను ఆదేశించారు. షెడ్యూలింగ్ అయిన దాన్యాన్ని ఆయా మిల్లులకు తరలించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల తహశీల్దారులు, మండల వ్యవసాయ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.