కురుపాం మండల కేంద్రంలో ఈనెల 27న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ ఆరోజున 20 ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కావున నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.