మన్యం జిల్లా సీతంపేటకు చెందిన పడాల భూదేవికి నారీశక్తి అవార్డు గ్రహీత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఆదివాసీలతో కలిసి మహిళా పారిశ్రామిక వేత్తలను, అటవీ ఉత్పత్తులతో వస్తువుల తయారీ, ఎఫ్పీవోల రైతులకు మార్కెటింగ్ కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధనా స్థలం సాయంతో అధిక దిగుబడులు సాధించడం తదితర కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ అవకాశం దక్కినట్లు మంగళవారం ఆమె పేర్కొన్నారు.