పార్వతీపురం: అధిక లోడ్ వాహనాల్లో ప్రయాణాలు వద్దు

67చూసినవారు
పార్వతీపురం: అధిక లోడ్ వాహనాల్లో ప్రయాణాలు వద్దు
అధిక లోడ్ వాహనాల్లో ప్రయాణాలు వద్దని మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఎం శశి కుమార్ విజ్ఞప్తి చేశారు. జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా సంక్రాంతికి సొంత ఊర్లకు విచ్చేసిన ప్రజల తిరుగు ప్రయాణంలో ఉన్నవారికి శుక్రవారం పార్వతీపురం రవాణా శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గమ్య స్థానాలను తొందరగా చేరుకోవాలనే ఉద్దేశంతో అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, మ్యాక్సీ క్యాబ్ లు వాహనాలలో ప్రయాణించరాదని కోరారు.

సంబంధిత పోస్ట్