మెగా ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రెడ్డి అనిత అప్పలనాయుడు సూచించారు. సోమవారం ఈ శిబిరాన్ని సీతానగరం మండలం కొత్తవలస గ్రామంలో ప్రారంభించారు. పశువైద్య చికిత్సలు, గర్భ కోశ వ్యాధులకు చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు వంటి అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ అధికారులు, రమణమ్మ, శ్రీను, ఈశ్వరమ్మ, ఆదిలక్ష్మి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.