ఏపీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి కలిసొచ్చింది. పండుగ వేళ నడిపిన బస్సులతో దండిగా ఆదాయం సమకూరింది. ప్రత్యేక బస్సులను నడిపించడంతో పార్వతీపురం ఆర్టీసీ డిపోకి రూ. 32. 47 లక్షలు సంక్రాంతి ఆదాయం వచ్చిందని సోమవారం మేనేజర్ కనకదుర్గ తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదుకు ప్రత్యేక సర్వీసులు నడిపామని వెల్లడించారు. ఈ క్రమంలో సంక్రాంతికి ప్రయాణికులను అధిక సంఖ్యలో తమ గమ్యస్థానాలకు చేరవేసి ఆర్టీసీ రికార్డు సృష్టించింది.