విద్యార్థులు తలచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరని, అటువంటి వాటికి నాంది పలికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలుగా జిల్లా విద్యార్థులు ఎదగాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభిలషించారు. శుక్రవారం పట్టణంలోని డీవివిఎం స్కూల్ ఆవరణలో మన్యం జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన విద్యాశాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం ఘనంగా జరిగింది.