ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చని, ఆధ్యాత్మి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం పట్టణంలోని ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు ఆయన పాల్గొన్నారు. శాంతిని కోరుతూ నిర్వహించిన హోమం, ఇతర పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని భక్తులతో కలిసి పూజ చేశారు.