నూతన సంవత్సరంలో జిల్లాను రక్తహీనత నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2024 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను, 2025లో నూతన ప్రణాళికలను తెలియజేశారు. రక్తహీనత నియంత్రణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించిందన్నారు. గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.