సీతానగరం మండలంలోని పంట పొలాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులపై గురువారం పిచ్చి కుక్క దాడి చేసి గాయపరిచింది. క్షతగాత్రులు పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్క ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ తామరఖండి, బళ్ళకృష్ణాపురం, బక్కుపేట గ్రామల మధ్య ఉన్న పొలాల్లో ఎవరి పొలాల్లో వారు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సమయంలో వెనుక నుంచి వచ్చి గాయపర్చింది.