శంబర శ్రీ పోలమాంబకు మంగళవారం మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నారాయణ రావు, అర్చకులు సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి పట్టువస్త్రాలు అందించి ఆలయ సంప్రదాయంతో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించాలని ఆకాక్షించారు.