వైభవముగా ఆదిత్యుని కళ్యాణం

72చూసినవారు
వైభవముగా ఆదిత్యుని కళ్యాణం
ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. చైత్ర బహుళ ఏకాదశిని ( మతత్రయ ఏకాదశి ) పురస్కరించుకొని శనివారం స్వామి వారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8. 00 గంటలకు కళ్యాణం ప్రాంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో ఎస్. చంద్రశేఖర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్