మెంటాడ మండలం కొంపంగి మార్గమధ్యంలో 20 బస్తాలు (900 కేజీలు) పౌరసరఫరాల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోని పోలీసులు పట్టుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యాన్ని అక్రమంగా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుకున్న బియ్యాన్ని సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో అప్పగించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.