మక్కువ మండలంలోని శ్రీ పోలమాంబ అమ్మవారి రాష్ట్ర జాతరకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తహశీల్దార్ షేక్ ఇబ్రహీం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాలూరు నుంచి మక్కువ వచ్చే వాహనాలకు అవసరమైన మేరకు పార్కింగ్ కోసం ప్రభుత్వ స్థలాలు కూడా గుర్తించామన్నారు. మక్కువ నుండి వెళ్లే వాహనాలకు శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని పశువుల పాక ఉండే స్థలాన్ని గుర్తించామని తెలిపారు.