సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామంలో శనివారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్ ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీలైనంత వేగంగా సభ్యత్వ నమోదు పొందాలని ఆయన కోరారు. రూ. 100 చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి రెండేళ్ల వరకు రూ. 5లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.