అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని వల్లంపూడి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం వేపాడ మండలం సోంపురంలో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై బి దేవి తెలిపారు. ఈ తనిఖీల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆయన వద్ద నుండి 8 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.