ఘనంగా శ్రీ పరదేశమ్మ తల్లి అనుపోత్సవం

52చూసినవారు
ఘనంగా శ్రీ పరదేశమ్మ తల్లి అనుపోత్సవం
వేపాడ మండలం బొక్కు నాయుడుపేట గ్రామదేవత శ్రీ పరదేశమ్మ తల్లి అనుపోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అమ్మవారిని గ్రామ పురవీధుల్లో డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలతో ఘనంగా ఊరేగించారు. కాగా అనుపోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తిశ్రద్ధతో పూజించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్