ఓటు అనే ఆయుధం ద్వారానే మార్పును సాధించగలం

57చూసినవారు
ఓటు అనే ఆయుధం ద్వారానే మార్పును సాధించగలం
ఓటు అనే ఆయుధం ద్వారానే మార్పును సాధించగలమని రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. శనివారం ఎస్ కోటలో నియోజకవర్గంలో గల ఓటర్లతో ఓటు హక్కు అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నిజమైన, పారదర్శక పాలన అందించే పార్టీని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ టిడిపి ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్