విద్యా కానుక స్టాక్ పాయింట్ ను పరిశీలించిన డీఈవో

84చూసినవారు
విద్యా కానుక స్టాక్ పాయింట్ ను పరిశీలించిన డీఈవో
వేపాడ మండల కేంద్రంలో గల విద్యా కానుక స్టాక్ పాయింట్ ను డీఈవో ప్రేమ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ముందుగా ఆయన పాఠశాలల వారీగా కిట్లు తయారీని పరిశీలించారు. పాఠశాలలకు సకాలంలో పుస్తకాలను పంపిణీ చేయడంలో సిబ్బంది అలసత్వం వహించకుండా, అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ పి బాల భాస్కరరావు, సి ఆర్ ఎం టి, ఎమ్ ఆర్ సి సిబ్బందితో పాటుగా పి టి ఐ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్