ఎస్ కోట మండలంలో కురిసిన భారీ వర్షం

65చూసినవారు
ఎస్ కోట మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత 3 రోజుల నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తోంది. మంగళవారం ఈదురుగాలులు లేకుండా వర్షం కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఖరీఫ్ పంటల సాగుకు ఈ వర్షాలు అనుకూలంగా ఉంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడుతున్న క్రమంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్