కొత్తవలస: ఎట్టకేలకు హాస్టల్ వార్డెన్ సస్పెండ్

70చూసినవారు
కొత్తవలస బాలికల వసతి గృహంలో వార్డెన్ మద్యం తాగుతూ తమతో అమానుషంగా ప్రవర్తిస్తోందని ఇటీవల విద్యార్థినిలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఇదే విషయంపై ఎమ్మెల్యే లలిత కుమారి హాస్టల్ ను సందర్శించి వార్డెన్ ను విచారించారు. ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా అధికారులు చర్యలు చేపట్టలేదని విద్యార్థినిల ఆందోళన మేరకు వార్డెన్ నీరజా కుమారిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో సమస్య సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్