శృంగవరపుకోట మండలంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఎంఈఓ-2 విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విద్యార్థుల యొక్క రోజువారి హాజరు వివరాలతో పాటు పరీక్షా సమాధాన పత్రాలను పరిశీలించారు. అనంతరం ప్రశ్నాపత్రాలకు సంబంధించిన లోపాలను గుర్తించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు.