విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోమ్స్ నుంచి బాలికలు బుధవారం రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. తమకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి మానసిక రోగులుగా మార్చుతున్నారని ఆరోపించారు. దీంతో తమలో చాలా మంది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని భోరున విలపించారు. దీనిపై ఉన్నతాధికారులు తక్షణం స్పందించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.