కె.వెంకటాపురంలో మరిడి మాంబ అమ్మవారి పండుగ

56చూసినవారు
కోటఉరట్ల మండలం, కె. వెంకటాపురం గ్రామంలో గురువారం శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్