ఒక ఉపాధ్యాయురాలిగా నేటికీ పాఠాలు చెబుతూనే ఎంతోమందిని ప్రముఖులుగా తీర్చిదిద్దిన ఏయూ ఫిజిక్స్ పూర్వ విభాగాధిపతి ఆచార్య శాంతమ్మ (94)కు అక్కయ్యపాలెంలో ఆమెను ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ గురువారం ఘనంగా సత్కరించారు. ఆమెకున్న రూ. 12 కోట్ల విలువ చేసే ఇంటిని కూడా శాంతమ్మ నిస్వార్ధంగా ఆర్ఎస్ఎస్ కు దానమిచ్చేసిన విషయాన్ని ఈ సందర్బంగా హేమంత్ గుర్తు చేశారు.