విశాఖ: ధరలను అదుపు చేయాలి
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గు నాయుడు హెచ్చరించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం సీతమ్మధార తహసిల్దారు కార్యాలయం వద్ద గురువారం నిత్యవసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపడం సరికాదని అన్నారు.