13న జీవీఎంసీ స్థాయి సమావేశం

84చూసినవారు
13న జీవీఎంసీ స్థాయి సమావేశం
జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశం ఈనెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కార్యదర్శి ఎంవీడీ ఫణిరామ్ బుధవారం తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆరోజు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. ఈనెల 4వ తేదీన జరగాల్సిన సమావేశం విజయవాడలో సంభవించిన వరదల కారణంగా వాయిదా పడిందని అన్నారు. ఈ మేరకు సమావేశం తేదీని అందరికీ తెలియజేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్