పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్. పి. ఎస్ వాత్సల్య యోజన పథకం ఎంతగానో దోహదపడుతుందని ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం విశాఖలో ఈ పథకాన్ని ప్రారంభించారు. విశాఖ సిరిపురం వద్ద నున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా పరిపాలన విభాగంలో పంకజ్ కుమార్, నాబార్డ్ డిడిఎం సామంత్ కుమార్ పాల్గొన్నారు.