కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై.. విశాఖ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. పథకాలను సక్రమంగా అమలు చేస్తూ అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సూచించారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.