ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ 2024- 2026సంత్సరాలకు గాను కొత్త కార్యవర్గం విశాఖలో ఏర్పాటయింది. అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మైలపల్లి లక్ష్మణరావు నూతన కార్యవర్గాన్ని గురువారం ప్రకటించారు. కొత్త కార్యవర్గం బాధ్యతలు కూడా చేపట్టింది. ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మైలపల్లి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శిగా సురపతి నర్సింగరావు, ఎన్నికయ్యారు.