అరకు సంత బయలు పరిసర ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఆపాలి

61చూసినవారు
అరకు సంత బయలు పరిసర ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఆపాలి
డుంబ్రిగుడ మండలంలోని అరకు సంత బయలు పరిసర ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు ఆపాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యనారాయణ జిల్లాకమిటీ సభ్యుడు సత్యనారాయణ మంగళవారం డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 1/70 చట్టానికి విరుద్ధంగా కొందరు గిరిజనేతరులు ప్రధాన రహదారులను ఆనుకొని శాశ్వత భవనాలు నిర్మించుకుంటున్నారన్నారు. ఈ సమస్యపై అధికారులు ప్రభుత్వం స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్